ఖాజా
అలా…
వెతుకుతూ ఎంత దూరమైన వెళ్లూ
నీకంటూ వారసుడొక్కడూ దొరకడు
దువా దోసిట్లోంచి జారిన నమ్మకం
వాడి చేతిలో కొత్తరకం ఆయుధమై
నిగనిగ మెరుస్తుంటుంది
నీ లాగే
ఈ భూమికీ సొంతమైందేదీ లేదు
చెట్లు - మొక్కలు - కొండలు - నీళ్లు - పువ్వులు
ఎవరి పేరు మీద రాయబడ్డాయో
ఎవరి కబ్జాలో కట్టుబడ్డాయో
ముక్కలు ముక్కలుగా పంచుకున్నదెవరో
పొక్కిలైన ఇసక గుండెల
మీదయుద్ధ టాంకరై నడిచి వెళ్లేదెవరో!
అంతరిస్తున్న పంటల మీద
ఆక్రమణకు గురవుతున్న నేల మీద
విస్తరిస్తున్న రోడ్లమీద
మొలుచుకొస్తునన సిమెంటు గుట్టలమీద
రహస్యంగా ఎవడి రాజముద్రలున్నాయో!
అచ్చంగా నీకులాగే
ఈ భూమికీ సొంతమంటూ ఏదీలేదు
పక్షులూ - జంతువులూ - మనుషులూ
నల్లవాళ్లూ - నంగిరివాళ్లూ - నీడలేనివాళ్లూ - నోరులేనివాళ్లూ
పరదేశులుగా ప్రచారమైనవాళ్లూ -
ఎవడి నసీబులోనూ
వెలుతురుకు తావులేదు!
ఎన్ని ఆలోచనలు సంఘర్షించినా
అంతరంగంలో అందరూ బానిసలే
అడ్డా లేబర్ లాంటి వీసా అంగడిలో
అమ్మకానికి సిద్ధమైన సరుకులే!
నిజంగా
ఈభూమికీ సొంతంగా మిగలబోయేదేదీ లేదు
పడమటి మేఘాలు
గొడ్జిల్లా నోళ్లతో భూమిని మింగుతుంటే
ఎంత దూరం పరుగెత్తినా
కనిపించని వలల ‘నెట్వర్కింగు వేట’
ఫైర్‌వాల్స్‌లేని మూడో ప్రపంచాన్ని
వైట్ హౌస్ వైరస్ సరికొత్త పేర్లతో కాటేస్తూనే వుంది!
స అసం
నాకిప్పుడు
కొత్త ఖిబ్లా కావాలి
అందులో
ఏక ధృవ ప్రపంచాన్ని కలగుంటున్నవాడు
ఏకాకిగా మిగలాలి
Saturday, November 24, 2007
Friday, August 17, 2007
దూదేకుల కవిత్వం
ఏ కులమని నను వివరమడిగితేఏమని చెప్పుదు లోకులకూలోకులకు పలుగాకులకూదుర్మార్గులకూ ఈ దుష్టులకూ- …………………………………….ఇంటిలోపలను యిల్లు గట్టుకొనిమంటలోపల రాటం బెట్టుకకంటిలోపల కదురు బెట్టుకొనిముక్కులోపల యేకు బెట్టుకొనిచేతిలో బాక చేతికి తీసుకనారాయణ యను నరము తీసుకొనిఅష్టాక్షరియను తడిక వేసుకొనిపంచాక్షరి యను పంచదీసుకొనితకథిమ తకథిమ గుబదెబ గుబదెబఏకిన కులమే మా కులముఏకిన ఏరులు పీకిన పిందెలులోకమంతనొక పాపము జేసుకఏకిన కులమే నా కులము(దూదేకుల సిద్దప్ప తత్వం)
ఏ అవమానానికి ప్రతిగా చెప్పాడో, ఏ ప్రశ్నకు సమాధానమిచ్చాడో కానీ - సిద్దప్ప కులం గురించి ప్రశ్నలనెదుర్కొన్నాడని అవమానింపబడ్డాడని - మాత్రం దీనివల్ల అర్ధం అవుతుంది. పోతులూరి వీరబ్రహ్మం వద్ద శిష్యరికం చేసిన సిద్దప్ప - కులమత అంతరాలను, విద్వేషాలను సామాజిక అసమానతలను తీవ్రంగా వ్యతిరేకించాడు. తన తత్వాలలోను, వచనాలలోనూ ఇదే విషయాన్ని బోధించాడు. ప్రచారం చేశాడు.దాదాపు మూడు శతాబ్దాల కిందట దూదేకుల సిద్దప్ప చెప్పిన తత్వం ఇది. ‘ ఏ కులమని నను వివరమడిగితే’ అనడంలో ‘మీదేకులం’ అని ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానంగా సిద్ధప్ప చెప్పిన ఈ వాక్యం రెండు శతాబ్దాలు గడిచాక ‘మీదేకులమన్న ప్రశ్న’ వెలయించి చివాలున లేచిపోవుచో - బాకున కుమ్మినట్లుగున్’ అన్న జాషువా పద్యం కూడా ‘ ఇదే ప్రశ్నకు’ సమాధానం. అంటే రెండువందల ఏళ్ల తర్వాత కూడా సమాజం పరిస్థితిలో, నిచ్చెనమెట్ల వ్యవస్థలో ‘గౌరవాల’ స్థాయిలో ఏ మార్పూలేదని మనం అర్ధం చేసుకోవచ్చు.దూదేకుల సిద్ధప్పకు జాషువాకు ఎదురైన ప్రశ్నే మళ్లీ ఇరవయ్యో శతాబ్దపు చివర్లో మళ్లీ మద్దూరి నగేష్‌బాబుకూ ఎదురైంది. అందుకే నగేష్‌బాబు ‘మీరేవుట్లు’ కవిత వొచ్చింది.“మేం ఎవరిమైతే మీకెందుకంట?మేము ఏవుట్లమైతే మీకెందుకంట?మా కులమేందో తెలియకపోతే మీకు తిన్నది అరగదా?మా పుటకేందో తెలుసుకోకపోతే మీ తూరుపు తెల్లారదా?'’(మద్దూరి నగేష్‌బాబు - మేరేవుట్లూ…?)అంటే మారుతున్న కాలంతో పాటుగా ‘మీదేకులం’ అన్న ప్రశ్న పదునుదేరింది తప్ప పాతబడలేదు మాసిపోలేదు. ఆయాకులాలకు, ఆయా అవమానిత దళిత జాతులకు ప్రతినిధులుగా ఈ ముగ్గురు కవులు గొంతు విప్పారు. అంటే మొత్తం జాతి పొందుతున్న అవమానానికి, తలెత్తుకునే స్థితిలేని సామాజిక అణచివేతకు ఈ కవితలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.మనుషులంతా కులాలుగా, మతాలుగా, జాతులుగా విడిపోయి తప్ప కలిసి బతకలేని స్థితి భారతీయ సమాజంలో వుంది. ఇది ఈనాటిది కాదు. ఆర్యజాతి భారతగడ్డమీద అడుగుపెట్టినపుడు జరిగిన వేర్పాటు. ఈ కుట్రపూరిత వేర్పాటు వాదానిది ఊసరవెల్లి తత్వం. ఇది స్థానాన్ని బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితిని బట్టి తన ఉనికిని, స్వభావాన్ని మార్చుకుంటుంది. కాలంమారినా స్థితిమారినా స్థలం మారినా, మతం మారినా అంటరానితనపు ముద్ర దళితుల్ని వెంటాడుతూనే వుంది.శతాబ్ధాల కింద హిందూ, దళిత, బహుజనులు ఇస్లాంలోకి మతం మార్చుకున్నారు. అలా మతం మారడానికి ముందు వీరు నవారునేత, బట్టలనేత, గుర్రాలు కాయడం, పరుపులు కుట్టడం, గుంటమగ్గం నేత వంటి వృత్తులమీద ఇతర తక్కువహోదా కలిగిన కులవృత్తులమీద ఆధారపడి బతికేవారు, హిందూ అణిచివేత నుంచి వెలివేతలనుంచి బయటపడాలని కలలు గన్న వీరికి ఇస్లాం మతం కొత్త వెలుగులా కనిపించింది. ఆకర్షించింది. మతం మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈమత మార్పిడివల్ల తమకేదో అద్భుతం జరగబోతుందని అనుకున్నవారికి నిరాశే మిగిలింది. అణచివేత, అవమానం అలాగే మిగిలాయి. పెద్దమార్పులేదు.కొత్తమతంలో వీరంతా దూదేకులయ్యారు. అనుకున్నంత హోదా, గౌరవం దక్కక అయోమయస్థితిలో మిగిలిపోయారు.మతం మారిన తర్వాత వీరి రోజువారి జీవనంలోనూ, వేషంలోనూ, భాషలోనూ, ఆహారపు అలవాట్లలోనూ పెద్దమార్పులు చోటుచేసుకోలేదు. పూర్తి ముస్లింలుగా వీరిలో మార్పులు (ముస్లిమిసతిఒన్) జరగలేదు. గ్రామీణ ప్రాంతాల్లో సూఫీ ప్రవక్తల ప్రభావంతో దర్గాలకు, జెండా చెట్లకు మొక్కులు చెల్లించుకునే దళిత బహుజనులు అనేకమంది వున్నారు. ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేని కొన్ని ఊర్లలో ఉర్సులు, పీర్ల పండగలు జరిపే దళిత బహుజన కుటుంబాలున్నాయి. అంటే మతం మారకపోయినా వీరు ముస్లిం సంప్రదాయాలను, ఆచారాలను పాటించడం చూడవచ్చు. హలాల్ చేయనిదే మాంసం ముట్టని దళిత బహుజనులూ వున్నారు. అయితే వీరు హిందువులుగా తమ మతంలోని ఆచారాలను పాటిస్తూ ముస్లిం - ఆచారాలనూ అలవరచుకున్నారు. దసరా పండుగ చేసినట్టే పీర్ల పండగనూ చేసుకుంటున్నారు.ఇదే స్థితి దూదేకుల్లోనూ ఉంది. అంటే సరళీకరించిన ముస్లిం ఆచార వ్యవహారాలను పాటించే దూదేకులు - హిందూ సంస్కృతి నించి కూడా పూర్తిగా బయటపడలేదు. అందుకే పీర్లపండుగనూ దసరాను దూదేకులు ఒకేరకంగా జరుపుకునే స్థితి ఉంది. నిజమైన ఏకత్వాన్ని, పరమత సహనాన్ని స్నేహభావాన్ని దూదేకుల జీవితం ప్రతిబింబిస్తుంది.దూదేకులకు భూమి, విద్య, సొంత ఆస్తి, సాంఘిక హోదా లాంటివేమీ లేవు. రెక్కల కష్టం మీద బతికే అట్టడుగు స్థాయి వర్గంగా, ముస్లిములలో రెండో తరగతి వారుగా దూదేకులు సామాజిక అణచివేతకు గురవుతున్నారు. దూదేకటం, పరుపులు కుట్టడం, నవారునేత, బ్యాండు సన్నాయి మేళం వాయించటం, సోడాలు అమ్మటం, టైలరింగ్, మెకానిక్ పనులు, వ్యవసాయ కూలీ వంటి సామాజిక గౌరవం దక్కని అల్పాదాయ వృత్తులపై ఆధారపడి బతుకుతున్నారు.చదువులోనూ, ఉద్యోగ, రాజకీయ రంగాల్లోనూ దూదేకులు వెనుకబడి ఉన్నారు. 1960 ల తర్వాత మొదటి తరం చదువుకోవటం మొదలుపెట్టింది. అయితే ఈ చదువులు వీళ్లను గుమస్తాలు, టీచర్ల స్థాయిని మించి ముందుకు తీసుకెళ్లలేదు. ఇంజనీర్లు, డాక్టర్ల వంటి వారు దూదేకుల కులంలో వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఇక ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. స్థాయిలో ఒక్కరు కూడా లేరు. పారిశ్రామిక వేత్తలు, క్యాపిటలిస్టులు భూతద్దంతో వెదికినా దొరకరు. రాజకీయాల్లో జెండాలు మోసేవారుగా, ఉద్యమాలలో బ్యానర్లు కట్టేకవాళ్లుగా తప్ప పదవులకు, ప్రాతినిధ్యానికి వేల మైళ్ల దూరంలో వున్నారు.ప్రభుత్వం ఇచ్చిన బి.సి.’బి’ రిజర్వేషన్ కూడా దూదేకుల విద్యా, ఉద్యోగ, ఆర్ధిక స్థాయిలో పెద్దగా మార్పు తేలేకపోయింది. ముఖ్యంగా మిగతా బి.సి.లతో పోటీలో దూదేకులు వెనుకబడిపోక తప్పలేదు.బ్రాహ్మణీయ రచయితలు, సినిమా రంగం దూదేకులను పింజారీ వెధవలు చేసింది. ముస్లిం సమాజం వీళ్లను లథాఫ్లను చేసింది.ఇక తెలుగు సాహిత్యంలో దూదేకుల కవులు, రచయితలు పద్యరచనా కాలం నుంచీ వున్నప్పటికీ వారు సాధారణ బ్రాహ్మణీయ సాహిత్య వొరవడిలోనే రాయక తప్పలేదు. ఆధునిక కవుల్లో దిలావర్, ఖమ్రొద్దీన్, యాకూబ్ వంటి వారు తెలుగు కవిత్వంలో తమదైన స్థానాన్ని నిలుపుకున్నారు. అసలు సాహిత్యంలోకి ప్రవేశించే కవులుగా, రచయితలుగా నిలబడ్డమే కష్టమైన స్థితిలో సమకాలీన కవిత్వం రాసి తమదైన ముద్రను సాహిత్యంపై వేయగలిగారు. కానీ - స్వంత అస్థిత్వాన్ని మాత్రం సాహిత్యంలో ప్రవేశపెట్టలేకపోయారు.దళిత సాహిత్యంలో వివిధ కులాలు తమ ప్రత్యేక అస్థిత్వాల గురించి ప్రశ్నించడం మొదలైన తర్వాత - దూదేకులు కూడా తమ జీవన వాస్తవాలను సాహిత్యంలో ప్రతిబింబించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇన్నేళ్లుగా సాహిత్య గౌరవానికి నోచుకోని దూదేకుల జీవితంలోని అనేక కోణాలను సాహిత్యానికి పరిచయం చేశారు.“ఏకుతున్న దూది పింజెలు పింజెలుగా విడిపోయిఅమ్మముఖం ముందు గాల్లో ఎగురుతుంటేచంద్రుని ముందు మబ్బుతునకలు తారట్లాడినట్లుంటుందిపత్తిచేళ్ల మధ్య దూదితీసిన పత్తిగింజైపోయిననా ముసలి తల్లికవానేలాడదీసి దారాన్ని లాగుతూ దూదేకుతుంటేనా నరాల్నెవరో వీణతీగలు చేసి మీటుకుంటున్నట్టుంటుంది'’(ఖాజా – మా…)1995 ఫిబ్రవరిలో వెలువడిన ఈ కవిత దూదేకుల కష్టాన్ని సాహితీ పటం మీద ఆవిష్కరించింది. దూదేకుల జీవితానికి, శ్రమకు సాహిత్య గౌరవాన్ని కల్పించింది.“పగిలిపోయిన సర్కారు దవాఖానా కళ్లద్దాల్లోంచి -వణుకుతున్న ముడతలు పడ్డ చేతులతో మా అమ్మచినిగిన చొక్కాలకు మాసికలూ - బొంతలకు అతుకులూ కుడుతుంటేనా గుండెకెవరో మిషను కుట్టేస్తున్నట్టుంటుందిపరుపులు కుట్టీ కుట్టీ అలసిపోయిన అమ్మకటికనేలమీదలా నడుంవాల్చి కునుకుదీస్తేకాబూలీవాడి అప్పు కల్లోకొచ్చిలాగిపెట్టి తన్ని లేపుతుంది.(ఖాజా – మా…)దూదేకులు సామాజికంగా, ఆర్ధికంగా దీనమైన స్థితిలో వున్నారు. శ్రమను నమ్ముకొని బతుకుతున్నారు. చాలీచాలని సంపాదనతో కనీసం మూడుపూటల తిండి దొరక్క దరిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. అప్పుల పాలైపోయి బికారులుగా దిగజారిపోతున్నారు.ఈ పరిస్థితులను దూదేకుల కవిత్వం బలంగా వ్యక్తీకరించింది. ఆర్థికంగా, సామాజికంగా, మతపరంగా తమమీద కొనసాగుతున్న అణచివేతను ప్రశ్నించింది. ఇస్లాం మతంలో అసలు కులమే లేదని చెప్తూనే దూదేకులను తక్కువగా చూసే, ఎగతాళి చేసే ‘మోలీసాబ్’ల మోసాన్ని నిలదీసింది. తమ సాంస్కృతిక వెనకబాటును చూసి ఈసడించుకునే ‘ఛాందస’వాదులను - తమ పేదరికాన్ని చులకన చేసే నవాబులనూ దూదేకుల కవిత్వం కాలర్‌పట్టి నిలదీస్తుంది.సామాజిక - సాంస్కృతిక దృష్టిదూదేకుల కవిత్వం తమ సాంస్కృతిక - సామాజిక వెనకబాటును కవిత్వీకరించింది. ఒక సామాజిక సమూహంగా తమ అస్థిత్వ సమస్యను, ఒక కులంగా ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలను, మతంలోని వారిగా ఎదుర్కొంటున్న అవమానాలను దూదేకుల కవిత్వం ఎజెండా మీదకు తెచ్చింది.“చెబితే నమ్మరేమో కానీ చెప్పుకుంటే మీ ముందుపలచనై పోతామని భయంపెంటు సాబు, ఉద్దండు, దస్తగిరి, నాగులు, చిన ఆదాంలాలు, పెదమౌలా, చినమౌలా, షేకు శ్రీనివాసుబేతంచర్ల మొయిను, పాటికట్ట మల్సారు - ఇవే కదా మా పేర్లు'’.(యాకూబ్ - అవ్వల్ కలిమ)ముస్లిమీయతను పూర్తిగా సంతరించుకోలేక పోయిన దూదేకుల అంతర్మధనాన్ని ఈ కవితలో యాకూబ్ వ్యక్తికరించిన తీరు అద్భుతమైంది. ముస్లింలమని ఎంతో ‘గాంభీర్యం’గా చెప్పుకునే దూదేకులు, ముస్లింల నుంచి ఎదుర్కొనే వివక్షను బయటికి చెప్పలేక లోలోపలే దుఃఖిస్తున్నారు. హిందూపేర్లతో, హైందవ సంస్కృతిని ఆచరిస్తూ ముస్లింలుగా వుంటూ రెండు సంస్కృతుల మధ్యా నలిగిపోతున్నారు.“షేక్, సయ్యద్, పఠాన్ - మీ దర్పాల హోదాల ఖాందాన్లపేర్లుచెప్పి మమ్మల్ని దగ్గరికైనా చేరనిచ్చారా!లద్దాఫ్, దూదేకుల, కసాబ్, పింజారీ………వృత్తిని కులమై కరిచిన కాలపు గుర్తులమయ్యాం.'’(యాకూబ్ - అవ్వల్ కలిమ)భారతీయ కులసమాజపు ప్రభావంతో ముస్లిములు కూడా ఇక్కడ హెచ్చుతగ్గులుగా విడిపోయి వున్నారు. షేక్, సయ్యద్, పఠాన్లు అష్రాఫ్ (ఉన్నత వర్గం)గా చెలామణి అవుతుండగా లద్దాఫ్, నఫ్రూ, గొడారి, కాసి వంటి కులాలన్నీ అజ్లాఫ్ (కిందివర్గం)గా ఉన్నత ముస్లిం సమాజానికి దూరంగా - అంటరానివారుగా వుంటూ అవమానాలు ఎదుర్కొంటున్నారు.” ఈ లోకాకులన్నీ నన్ను ఏకాకిని చేసిఏకుల్లో తొక్కిస కథ యిదిమసీదుని నాలుగు గుమ్మటాలతో భాగించినట్లుఅందర్నీ పోగులుగా కలిపినేసిన మతం తానునిఎక్కువ తక్కువ ముక్కలుగా చింపినమను ముల్లాల సంగతి యిది.అందరూ సమానమేనని చెప్పిన అల్లాకళ్లలో కారం కొట్టినా నిచ్చెనమెట్లను తెగనరికినన్నో మరుగుజ్జుగా మలిచినమోసపు మోలీసాబ్ల నమ్మక ద్రోహమిది'’(ఖాజా - ఏకేకులం - 1)అల్లా ప్రతిపాదించిన ‘ఇస్లాం’ కులాలకు అతీతమైనది. అసమానత్వానికి, కులవ్యవస్థకు చోటులేని ఇస్లాంకు ఇక్కడి ముల్లాలు మనువాదులై కులజాడ్యాన్ని అంటించారు. అందరూ సమానంగా వుండాల్సిన చోటు కొందర్ని తక్కువ వాళ్లను చేసి అట్టడుగుకు నెట్టివేసిన ముల్లాలను, మనువులుగా పోలుస్తున్నాడు కవి.దూదేకుల్లో దేశం గర్వించదగిన కళాకారులున్నారు. ముఖ్యంగా నాదస్వర సామ్రాజ్యాన్ని ఏలిన షేక్ చినమౌలానా వంటి విద్వాంసులు, బుర్రకథా పితామహుడు నాజర్ వంటి కళాకారులు దూదేకుల కులం నుంచి ఎదిగిన ప్రముఖులు. నిజానికి దూదేకుల కులంలో నాదస్వర విద్వాంసులు అనేకమంది వున్నారు. ముఖ్యంగా దేవాలయాల్లో, పండుగలు, దేవుళ్ల ఊరేగింపుల్లో, పవళింపు సేవల్లో, మేల్కొలుపు సేవల్లో దూదేకుల విద్వాంసుల నాదస్వరాలాపన ఎంతో ప్రాముఖ్యత కలిగి వుంది. అదే సందర్భంలో వీరిపై అవహేళన, అణచివేతకూడా ఉంది.“నేను లేకుండానా మట్టికాళ్లీ గుళ్లలోకి నడవకుండానాజుమ్మా స్నానాల దూదేకుల కంపులేకుండానా ఎంగిలి పీకల సుప్రభాతాలు లేకుండాఇక్కడ ఏ దేవుడికీ కనీసం మెలకువైనా రాదువాడి పవళింపు సేవకోసంపాటను పన్నీటి జల్లును చేసింది నేనువాడి ఉత్సవ ఊరేగింపుల కోసంగాలి తిత్తినైరాగాల పరిమళంగా పరుచుకునేదీ నేనే'’(ఖాజా - ఎంగిలి పీక)డాబు కోసం, దర్పంకోసం దూదేకులు - ఉర్రూతలూగటం లేదు. ఇవాళ ఎలా గడుస్తుందోనన్న దిగులుతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఉర్దూ - అరబ్బీలు నేరవడానికి, ఐదుపూటల నమాజ్‌లకు అసలు అవకాశమే లేని స్థితిలో అస్లీ ముస్లింగా మారలేనందుకు దుఃఖపడాల్సిన అవసరమేలేదు.“నా దూదేకులతనాన్ని షోహర్ ఆపాదించుకోనప్పుడుఅస్లీ ముస్లిం ముద్రని మాత్రం నేనెందుకు భరించాలి?దారిద్య్రం నా కలల్ని - ఆకలి కాలాన్ని మింగేస్తుంటేదుఃఖ జంఖానాలో ఎక్కెక్కిపడ్డ నాబచ్పన్పరుపులు కుట్టడమే నేర్చుకుందినేర్చుకోలేని ఉర్దూ అరబ్బీల గురించినేనెందుకు దుఃఖించాలి'’(షాజహానా - లద్దాఫ్ని)ఆర్ధిక పేదరికంతో పాటుగా దూదేకుల్లో సాంస్కృతిక వెనుకబాటు తనం వుంది. ఈ వెనకబాటు కారణంగా వీరిలో, సగం ముస్లిమీయ సంస్కృతి సగం హిందూ సంస్కృతి ఉంది. వేషం, భాష, ఆచార వ్యవహారాలన్నింటిలో ఈ సంయుక్త సంస్కృతి కనిపిస్తుంది.ఈ దేశంలో నిజమైన లౌకికవాదులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్లు దూదేకులే. ఎందుకంటే ముస్లిం - హిందూ సంస్కృతుల సమ్మేళనంగా వుంటూ ఈ రెండూ మతాల మధ్య దూరాన్ని చెరిపేసేరు. ‘హిందూ - ముస్లిం భాయి భాయి’ అన్న నినాదం అస్లీ ముస్లింలకు, బ్రాహ్మణ హిందువులకు నినాదం మాత్రమే కానీ - దళిత బహుజనులకు, దూదేకులకు ఇదే జీవనసూత్రం అయింది. ఈ సూత్రమే గ్రామీణ ప్రాంతాల్లో వీరిని ఐక్యంగా వుంచుతుంది.ముస్లింలోనూ - హిందువుల్లోనూ ఉన్నత వర్గాలుగా, కులాలుగా అధికారాలను, హోదాను, గౌరవాలనూ అనుభవిస్తున్న వారికి ఈ సంయుక్త జీవన సూత్రం శత్రువైంది. అంటరానిదైంది. అందుకే దూదేకులు ముస్లింలలో కింది తరగతివాళ్లుగా మిగిలిపోయారు. దీన్నే దూదేకుల కవులు ప్రశ్నిస్తున్నారు.ఆర్థిక దృష్టిఆర్థిక దృష్టి కోణం నించి పరిశీలిస్తే దూదేకుల పరిస్థితి దళిత, బహుజనుల కన్న వందలరెట్లు దిగజారిపోయింది. తినటానికి, కనీసం కడుపునిండా తిండిలేక, ఉండటానికి ఒక గూడైనా లేక దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్నారు. చిన్న చిన్న వృత్తులమీద ఆధారపడి చాలీచాలని సంపాదనతో బతుకును తప్పనిసరై అలా నెట్టుకొస్తున్నారు.ప్రపంచీకరణ నేపథ్యంలో చేతివృత్తులకు, చిన్న పరిశ్రమలకు కనీసం నిలువనీడలేక పోయింది. ముఖ్యంగా కాయర్ పరిశ్రమ దేశవ్యాప్తంగా వున్న పరుపుల మార్కెట్‌ను ఆక్రమించగా కులవృత్తిగా దూది ఏకి పరుపులు కుట్టే దూదేకులు ఇవాళ పైసా సంపాదన లేక దిక్కులేని వారుగా నడిబజార్లో నిలబడ్డారు. దుర్భరమైన పేదరికంతో, ఆకలితో అలమటిస్తున్నారు.“సెంచురీ నా కంచంలోంచి అన్నం ముద్దని తన్నుకుపోయిందిపాలిష్ట్ స్పాంజి పిల్లోనా గొంతుమీద తన సుతిమెత్తని చేతులుంచి నులుముతుందినా ఊపిరిచుట్టూ ఒక ఉచ్చుదేశ సరిహద్దుల్లో పాతిన ముళ్ల కంచెలా బిగుసుకుంటుంది.నైపుణ్యం నిండిన నా చేతివేళ్లమీదఒక విదేశీ ఫోమ్ పాదం నాడా బూట్లతో నృత్యం చేస్తుందిపగలని పత్తికాయలానా కవాను తీగల్లో ఒక అత్యాధునిక అపశృతిపంటికింద పలుకురాయిలా తగులుతుంది’(ఖాజా - నరం తెగిన కవాను)ఎన్నో తరాలుగా నమ్ముకున్న వృత్తి ఇవాళ ఎందుకూ పనికిరాకుండా పోయింది. విదేశీ కాయర్ ఉత్పత్తులు మార్కెట్‌ను ఆక్రమించేశాయి. దూదికి, దూదిపరుపులకు విలువ లేదు. కొనేవారు లేరు. సామ్రాజ్యవాదం కొట్టిన ఈ చావుదెబ్బకు దూదేకులు కకావికలమయ్యారు. కనీసం రెండుపూటలా తిండి కూడా దొరకని స్థితిలో మరింత పేదరికంలోకి జారిపోయారు. అయినా ఇది ఎవరి దృష్టికీ రాలేదు.దూది పరుపులకు మార్కెట్లో కాలం చెల్లిపోయినట్లే, గోళీసోడాలకూ కాలం చెల్లింది. సోడాలమ్ముకొని బతికే దూదేకుల సాయెబులను, కిన్లే, బిసిలరి, లెహర్పెప్సీ సోడాలు చావుదెబ్బకొట్టాయి. ఇక టైలరింగ్ పనిచేసేవారిని ‘రెడీమేడ్’ తొక్కేసింది. మొత్తం నమ్ముకున్న వృత్తులన్నీ ప్రపంచీకరణ దెబ్బకు నిల్వలేకపోగా- దూదేకులు పొట్ట చేతపట్టుకుని కొత్త వృత్తులను వెతుక్కుం టున్నారు. వ్యవసాయకూలీలుగా, తాపీపనివాళ్లుగా, రిక్షా, ఆటో రిక్షాతోలే వారిగా, డ్రైవర్లుగా కొత్త అవతారాలెత్తుతున్నారు.“నిన్నటి దాకానాచీనీ పళ్లెంలో అన్నం ముద్దైన తెల్లదూదిఇవాళ నాకళ్లలో ఘనీభవించిన తెల్లపోరైందినాబతుక్కొక ఆమీ అయిన ఊతకండెపాతడబ్బాల్లా నన్ను సాచి తన్నిందిసుతిమెత్తని దూదేకిన చేతులతోనేఇప్పుడు సుతారి పనిలో గమేలా మోస్తూ -అందమైన చమ్కీ పరుపులు కుట్టిన చేతులతోనేఇప్పుడు ఇటుకలు పేర్చిమట్టిపోసీ దిమ్మెస కొడుతూ -(ఖాజా - నరం తెగిన కవాను)ఇక చదువుకున్న వర్గం వాళ్లలో అధికభాగం టీచర్లుగా ఎదుగుతున్నారు. అక్కడక్కడా చిన్న ఉద్యోగాల్లో కొందరు స్థిరపడుతున్నా చదువుకున్న వారిలో కూడా ఎక్కువమంది ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొంటున్నారు.మొత్తంగా దూదేకుల సంఖ్య రాష్ట్రంలో 50 లక్షల వరకూ ఉండగా ఆర్థికంగా అత్యంత దుర్భరమైన స్థానంలో వున్నవారు 90% పైమాటే. అందుకే దూదేకుల కవులు తమ ఆర్థిక దుస్థితిని, ప్రపంచీకరణ కారణంగా దిగజారి పోతున్న దూదేకుల దౌర్బల్యాన్ని ప్రశ్నిస్తున్నారు. కవిత్వీకరిస్తున్నారు.దూదేకుల స్త్రీల దృష్టిముస్లిం స్త్రీలు మతపరంగా దుర్భర స్థితిలో వుంటే దూదేకుల స్త్రీలు మతంతో పాటు కులపరంగా కూడా దుర్భరస్థితిని ఎదుర్కొంటున్నారు. ముస్లిం స్త్రీలు ముస్లిం పురుష సమాజం నుంచి వివక్షనూ, అణచివేతనూ ఎదు ర్కొంటూ, హిందూమతం నుంచి ఛీత్కారాలను, దాడులను ఎదుర్కొం టున్నారు. కాగా దూదేకుల స్త్రీలు ముస్లిం సమాజంలో స్త్రీ పురుషుల నుంచి వివక్షనూ, అణచివేతనూ ఎదుర్కొంటూ హిందూ సమాజం నించి అవమానా లను ఎదుర్కొంటున్నారు.“పరుపులు కుట్టీ కుట్టీ అలసిపోయిన అమ్మకటిక నేలమీదలా నడుం వాల్చి కునుకుదీస్తేకాబూలీ వాడి అప్పు కల్లోకొచ్చి లాగిపెట్టి తన్ని లేపుతుంది'’(ఖాజా – మా…)అంటరానితనం మినహా మూడురూపాయలు అప్పుకట్టలేక అవమానించబడ్డ మహదేవమ్మకు, దూదేకుల తల్లులకు పెద్ద తేడాలేదు. పేదరికం, అవమానం రెండిట్లో ఏదిముందో - ఏదివెనుకో తెలియదు గానీ దూదేకుల స్త్రీలను ఈ రెండూ కలిసి మరింత లోతుకి తొక్కేస్తున్నాయి.దూదేకుల స్త్రీలు రీతి రివాజులు తెలియని వారుగా, ఉర్దూ రాని వారుగా, ఖురాన్ తెలియని వారుగా ముస్లిం సమాజం నుంచి అవమానించబడుతున్నారు.“కానరాని అశక్తతతో కళ్లెమైనా నోటిని బిగించి పట్టుకుంటుందిరెప్పల కొమ్మల్లోంచి వీచిన వాళ్ల సుడిగాలుల చూపుల్లోనేనో దూదిపింజనై హాలు హాలంతాఉన్నచోటి నుంచే గిరికీలు కొట్టబడతానువచ్చోరాదో - నా ఉర్దూ పరిజ్ఞానం మీదవాళ్ల కుతూహలాల ప్రావీణ్య ప్రదర్శన జరిగిముఖాల్లో పరిహాస ఫలితాల తేల్చేసాకతెగించి - బయటకు రాలేని మొహమాటపు నీటిచుక్కలుకంటికోనల్లో ఇరుక్కుని అచ్చం నాలాగే అల్లాడతాయి'’(షాజహానా - లద్దాఫ్ని)దూదేకుల స్త్రీల దుస్థితి ఇంతదాకా సాహిత్యం పట్టించుకోలేదు. సమాజానికి దూదేకుల్ని పట్టించుకునేంత పెద్ద మనసూలేదు. జ్ఞానమూలేదు. ఇటు ముస్లింల నుంచి అటు హిందువుల నుంచి, పురుషుల నుంచి దూదేకుల స్త్రీలు తక్కువగా, చులకనగా చూడబడుతున్నారు. చదువులేక, విజ్ఞానం లేక, మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకోలేక వెనకబడిపోతున్నారు.మొత్తంగా దూదేకుల సమాజం, ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల న్నిటి మీద ఐక్యంగా పోరాడాల్సి ఉంది. తమ మూలాలను సంస్కృతిని ప్రతిబిం బించే సాహిత్య సృజన చేయాల్సి వుంది. దూదేకుల కవిత్వానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఖాజా, యాకూబ్, షాజహానా, యండి యాకూబ్‌పాషా, దిలావర్ వంటి కవులు ఈ కోణపు కవిత్వానికి, సాహితీసృజనకు వాకిలి తెరిచారు. ఈ దిశలో మరింత మంది దూదేకులు తమ ప్రత్యేక అస్థిత్వాన్ని చాటుకునేందుకు, చరిత్రను నిర్మించేందుకు కవిత్వం రాయాల్సి ఉంది. భవిష్యత్తు సాహిత్యం దూదేకుల జీవన మూలాలను, సంస్కృతిని ప్రతిబింబిం చాల్సి వుంది.

Tuesday, July 3, 2007
Sunday, July 1, 2007
సారీ అంబేద్కర్! మేం వాడ దాటేశాం
ఖాజా
సారీ అంబేద్కర్! మేం వాడ దాటేశాం
రింగా రింగా రోజెస్‌ల
వినూత్న ప్రపంచావిష్కరణ జరిగిపోయాక
జేబుల్నిండా రంగు కాగితాల రంగవల్లులు నిండిపోయాక
ఇళ్ళలో కొత్తగా హైబిడ్ తులసిమొక్కలు అంటు కట్టుకున్నాక
తెగిపడిన తాతల నాలుక సాక్షిగా
కార్పొరేట్ కాలేజీలోపిల్లలకు సంస్కృతాన్ని సెకండ్ లాంగ్వేజిగా పెట్టి గర్విస్తున్నాక
విదేశీ ఇజాలకు భుజాలు అప్పగించిన బోయీలై
పెరటిచెట్ల వైద్యాన్ని
కార్పొరేట్ జార్ల పేటెంట్లకు తాకట్టు పెట్టేశాక
మొద్దుబారిన సిలుం కొడవళ్ళతో
ములకులిరిగిన దిగుమతి పెన్నుల్తో
నూత్న ప్రపంచావిష్కరణ కోసం
కోవర్టుల కొత్త వేషం వేసుకున్నాక
నువ్వు లాక్కొచ్చిన బండి రెండు చక్రాలూ
పట్టాలుతీసేసి- ఇరుసులు విరిచేసి
ఎప్పటికీ కలిసి నడవలేని వేరుకుంపట్ల నిప్పుకు
తలా కొంచెం నూనె గానుగాడించి పోసేశాక
-సారీ బాస్! వెనక్కి తిరిగి చూసుకునే అలవాటు లేదు!
వాడల్లో జనం వూర్లోకి జరుగుతున్న కొద్దీ
కులషితమైపోతున్న ఊళ్ళన్నీ
గిరిగీసుకున్న గేటెడ్ కమ్యూనిటీలుగా
డూప్లెక్స్ కలోనియల్ కౌంటీలుగా
తలా కాళ్ళూ చేతులూ
సంస్కృతి చిప్పలోకిసప్పున లాగేసుకుంటాయి
నోకియా గాలిపడవల మీద
లోకమంతా తిరిగొస్తున్న సూర్యుడు
కాలము-దూరము-వేగము సూత్రాన్ని
తీగల్లేని తంబురా మీద
కొత్త రింగ్‌టోనై ఆలపిస్తుంటే
- సారీ బాస్! దేబిరింపులూ, జాలికబుర్లూ వినే తీరిక లేదు!
గోడవతల గొడవల గురించీ
చిలుంపట్టిన సంకెళ్ళ గురించీ
అరిగిపోయిన ఆరెల గురించీ- గుర్తు రాదు
మాంశారం జంతులక్షణమనీ
పచ్చికాయలూ- ఆకులూ- అలములే మంచివనీ
మంతెన వంతెనెక్కి ఊళేసే నక్కల జాబితాలో
కొత్తగా పేరు నమోదు చేసుకున్నాక
వాడ గుడిసెల మీద ‘కొక్కొరోకో’లకు కొత్త అర్థాలు పుట్టుకొస్తాయి.
సారీ బాస్! నువ్వేం చేయలేకపోయినావన్నదే ప్రశ్న…
మేం ఏం చేశామో మాత్రం ఎవ్వరూ అడగడానికి వీల్లేదు.
ఏ చెట్టు కర్రల్ని
ఏ రంగు జెండాలకు తొడిగామో
ఏ చేను పంటల్ని
ఏ సంచులకెత్తి పంపామో
ఏ ఇంటి ఉప్పు తిని
ఏ వంతపాట పాడామో
ఎవ్వరూ ప్రశ్నించడానికి వీల్లేదు
బానిస సంకెళ్ళ కాలంలోంచి
బయటపడని వాడల గురించి దిగులు లేదు
ఓటమిలో కూరుకుపోయిన
పూట గడవని బతుకుల గురించి బెంగ లేదు
సారీ బాస్!
ఇవాళ మేం
పాష్ కాలనీలో
పాలిష్డ్ జీవితంలో
పేరు మార్చుకున్న పేతురులం
సంగదాసు వారసులం
శాంతి కాముకులం
ఓటమి ఎరుగని విజేతలం…
......కాకుంటే- ఊళ్ళో కాదు.

Saturday, June 30, 2007
Jihad
Khaja
Jihad
I’ve been watching everything
I’ve been noticing your every move
With wet eyes I’m still searching
for the corpse that floated away in the stream of Sixth December
Now though no foot can make humans human
I’m watching the process of converting them into rocks and maniacs
Al-kabir gherao
That stood between my starving stomach and my morsel of food
The flagpole that landed like a trident in the Hubli Idgah grounds
"Madhura" that’s trampled beneath your Kautilya brain
I’ve been watching
I thought Indivaram was the light that came to my house
Rajeevam was the perfumed fragrance that exuded my heritage
Paraded them promptly on my head
You too became Vamana’s feet
after walking over the bouquets of my dreams
Opening and seeing the pyjama of my faith and then
After slashing me brutally, after putting on tilak with my blood
I am left here only with bougainvillea citizenship
Finding nothing else to demolish
you must perhaps be irritated—impatient
just once let your hawk eyes pass over the corners of the century
on the banks of the Yamuna is visible
the moonlight palace that some crazy grandfather of ours
constructed, converting his love for grandma into a froth of milk
On the mound of Delhi—like planting a piece from the eastern sky
Is visible the Raj durbar as if panted in blood
And still for your religious arrogance
Qutub minar Charminar Buland Darwaza
Jumma Masid Mecca Masid Maharaja Palace become my traces
and keep pricking—keep hurting
even when you demolished, when you slashed throats we did not questioned
but—you splitting the country into pieces
you rearing animals in villages I cannot stand
you corpse-fucker—
for the rejuvenation of corpses is corpses are unavoidable—
then it’s inevitable
the first corpse will be yours
I have been watching everything

Roots
Khaja
Roots
I am looking back
Yes! Standing on the threshold of this twenty first century
I am looking back
I am fondling the scars of my pas injuries
By turning the pages of time one by one
Like reading Arabic books
Washing the worn out fossils of truth with tears
I am digging for my mother root
Breaking the rocks and mountains
I gave a shape to this earth and a passage to this water
without any laboratories and experiments
I was the primitive scientist who discovered that
rubbing two stones produces fire
from caves to huts
from signs to script
from tree to carved houses
I led the man by my little finger
I was the one who used burnt bricks in Kalibangan
I was the bloody Sindhu that flowed out of the massacre by horsed barbarians
I was the corpse of the orphan that shook Siddratha
I was the arama hung from Pushyamitra’s scared thread
it was me who could not recognize my changed face
day before yesterday a dasya yesterday a chandala
today as my millions of injuries are my witness I am a sayibu
in fact I am a dalit
when you entrusted me with the protection of village
I thought that was my livelihood
I could never imagine that you will burry me there itself
I thought it was true when you bluffed that caste discrimination
was to safeguard dharma
I could not think that you will banish me as an outcast
for your institutionalized selfishness
how many dark centuries…….how many bloody centuries?
Darkness all around…. blinding darkness…revenge…attack…
look here, only after this sayibu touched me on my shoulder
did my fear disappear
when these people with scared threads called me a demon
and attributed fangs horns and tails that I did not have
he came and declared me a human being
when the brahmins here closed the temple gates
he spread janimas in the masjid for me
when the dal eaters here closed their nose looking at me
badnamaz – he embraced me like the fragrance of perfume
I forgot my mother all these days
I forgot my blood forgot my roots
in a system where survival is impossible without brahmanisation
I too became a bearded Brahman and asked my elder brother to move away
considered my younger brother inferior….
but after this excavation after this rethinking
I am going to step in to my father’s house
I going to receive my parent’s heritage
by the Vedas that injured me all these years
by history
I am declaring that I belong to the majority
Though I am sayibu by religion I assert that a dalit by caste
Now I am marching to Delhi